#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి

పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి..
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి..
జాతీయ రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల సమన్వయ సమితి…
పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయిన రైతులను, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి కేరళ తరహాలో గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతు భరోసా కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు మంగళవారం నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ కార్యనిర్వాహక అధికారికి వినతిపత్రం అందజేశారు.