ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి న్యాయం చేయం
ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి, ప్రజలకు న్యాయం చేయండి.
అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్,.
ఈ తనిఖీల్లో భాగంగా పెదకాకాని, నల్లపాడు మరియు అరండల్ పేట పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ.
అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలను తనిఖీ చేసి, రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది ఫిర్యాదుదారులకు ఏ విధంగా స్పందిస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకుని, ప్రజల నుండి ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
ఎవరైనా నిందితులను లాక్ అప్(Lockup) లో ఉంచినట్లైతే వారి పర్యవేక్షణ కొరకు నియమించబడే పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా అంటూ,శాఖాపరమైన నియమ – నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.