డేగల ప్రభాకర్ రాష్ట్ర అభివృద్దిలో తన మార్క్ చూపా
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ రాష్ట్ర అభివృద్దిలో తన మార్క్ చూపాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. బుధవారం ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆత్మీయ అభినందన సభకు ఆమె హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ… రాష్ట్రంలోని యువతకు 20లక్షల మంది ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. గతంలో గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా తన బాధ్యతను చాలా నిర్వర్తించారని, ఇప్పుడు ఆయన స్వీకరించిన చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు.