సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల ఏర్పాటు పై అవగాహన సదస్సు
పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలపై జిల్లా స్థాయిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి
లావు కృష్ణ దేవరాయలు, కలెక్టర్ పి .అరుణ్ బాబు, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు,పి ఎం ఈ జీ వి అధికారులు, ఆర్డీఓ, ఎల్ డి ఎం రామ్ ప్రసాద్. ఈ కార్యక్రమానికి పథక సంచాలకులు బాలు నాయక్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నవీన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉన్న పరిశ్రమలకి సంబందించిన ప్రతినిధులకు, మహిళలకు జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలోని భువన చంద్ర టౌన్ హాల్ నందు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది