#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

నరసరావుపేటలో శానిటేషన్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తున్న డాక్టర్.చదలవాడ అరవింద బాబు

స్థానిక రెడ్డి నగర్ నుండి కోమలి రెసిడెన్సి దాకా మున్సిపాలిటీ మేజర్ కాలువను పెద్ద క్రేన్ తో కాలవలో ఉన్నటువంటి పూడికని తీయిస్తున్నారు. ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే తో కలసి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ మున్సిపల్ డ్రైవ్ ని పర్యవేక్షించారు. శానిటేషన్ డ్రైవ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గరుండి అన్ని వార్డులలో వర్క్ చేయేస్తున్న ఎమ్మెల్యే ని ప్రజలు కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో మరియు మున్సిపాలిటీ అభివృద్ధిలో మీకు ఎటువంటి సహాయ సహకారo కావాలి అన్న అందిస్తామన్నారు. డ్రైన్స్ పై కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని. డ్రైన్స్ లో మురికి నీరు పోయే విధంగా చూడాలన్నారు.