టిడిపి జాతీయ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన గళ్ళా మాధవి
టిడిపి జాతీయ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన గళ్ళా మాధవి.
మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు “ప్రజా వేదిక” గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు,ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి .ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు, భూదోపీడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని, స్పందన పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, అనేక సమస్యలు పెండింగ్లో ఉంచారని, అందుకూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదులను వాటి శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అర్జీదారులకు గళ్ళా మాధవి హామీ ఇచ్చారు.