#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

గుంటూరు జిల్లా పోలీస్.

గుంటూరు జిల్లా పోలీస్…

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు అమరుడైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు

అమరజీవి శ్రీ పొట్టి. శ్రీరాములు గారి వర్ధంతి(ప్రతి సంవత్సరం డిసెంబర్ 15)ని ఆత్మార్పణ దినం గా ప్రక‌టిస్తూ జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

ఈ సందర్భంగా ఈరోజు(15.12.2024) జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ పొట్టి. శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించిన శ్రీ ఎస్పీ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తన ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు.ఆంధ్రులకు ప్రాత:భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అను శ్రీ పొట్టి శ్రీరాములు గారి గొప్పతనాన్ని గురించి శ్రీ ఎస్పీ గారు కొనియాడారు.

అకుంఠిత దీక్ష, నిస్వార్థం, ఏదైనా సాధించాలని పట్టుదల, కార్య దక్షత, అలుపెరుగని పోరాటం వంటి ఎన్నో సుగుణాలను అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి నుంచి మనం నేర్చుకోవాలని, వాటిని అలవర్చుకొని మన లక్ష్యాలను చేరుకోవాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు.