జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా మంత్రి
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు, జర్నలిస్టుల రక్షణ కొరకు కఠిన చట్టాలు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమయింది