#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్ధం చేయడం

పెంచిన కరెంటు చార్జీలను విరమించుకోవాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అదేవిధంగా సోలార్ విద్యుత్ స్కాంలో బాధ్యులైన ఆదాని ఆదాయాన్ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లు పెంపుదల చేయడం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకపోయినా ప్రజలపై విద్యుత్ చార్జీల పేరుతోటి భారాలు మోపుతుందని వెంటనే విద్యుత్ చార్జీలు వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి నిలుపుదల చేయాలని లేని పక్షంలో చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ బాబు, గుదే భిక్షాలు, జి నాగేశ్వరరావు, కొమ్ము పుల్లయ్య, కనకారావు, షేక్ మాబు ,హసాన్వలి, మురికిపూడి చిన్న ,ధీరు నాయక్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు