#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

ఏపీలో రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో అమరావతిలో పనులకు అనుమతి ఇవ్వాలని సీఆర్డీఏ ఈసీకి లేఖ రాయగా అభ్యంతరం లేదని బదులిచ్చింది. టెండర్లు పిలవొచ్చని, అయితే ఎన్నికలు పూర్తయ్యాకే ఖరారు చేయాలని పేర్కొంది.