పెట్రోల్ ధరలు తగ్గుతాయి: మోదీ

గత పదేళ్లలో 25 కోట్లమందిని పేదరికం నుంచి బయటపడేశామని ప్రధాని మోదీ తెలిపారు. లోక్సభలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. “వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం. మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. ఇథనాల్ బ్లెండింగ్తో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గుతాయి” అని పేర్కొన్నారు.