సమగ్రాభివృద్ధి సాధ్యాసాద్యాలపై సమలోచనలు..!

రెండు దశాబ్ధాలుగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మాచర్ల నియోజకవర్గానికి శాసన సభ్యులుగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుపొందడంతో నియోజకవర్గానికి మహర్ధశ పట్టనున్నది. రానున్న రోజుల్లో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించడానికి వడివడి అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రమైన మాచర్ల పట్టణం నలుదిశలా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా ప్రాథమికంగా అవసరమైన మౌళిక వసతులు, సదుపాయాలు, సౌకర్యాలు, ప్రభుత్వరంగ సేవలు, వినోదం, ఆహ్లాదం, క్రీడలు వంటి వాటి వాటిపై స్ధానిక శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ప్రజకు మెరుగైన వైద్యసేవలు, ప్రజా సేవలకు ఒకే ప్రాంగణంలో సమగ్ర ప్రభుత్వ కార్యాలయాలు, వినోదం, ఆనందం, ఆరోగ్యం కోసం రెండు ఎకరాల్లో గ్రీన్ గార్డెన్ పార్క్, వాకింగ్ ట్రాక్, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందకు క్రీడా స్టేడియం వంటి నూతన నిర్మాణాలు చేపట్టేందుకు ఎమ్మెల్యే జూలకంటి సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ కార్యరూపం దాల్చే దిశగా.. శుక్రవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషర్ వేణుబాబుతో ఎమ్మెల్యే భేటి అయ్యారు. అభివృద్ధికి సంబంధించిన మౌళిక సదుపాయాల కల్పనకై మాచర్ల గ్రామ కంఠం రెవిన్యూ ల్యాండ్స్ మ్యాప్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.