ఉగాది రోజు పేదలకు సాయంపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం

అమరావతి, మార్చి 30 : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.