కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు

కార్తీక సోమవారం సందర్బంగా నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు కోటప్పకొండలో పర్యటించారు ఎమ్మెల్యే త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కోటప్పకొండలో భక్తుల సౌకర్యార్థం “దివిస్” లేబరేటరీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్ధ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్ధ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితిగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం […]

ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు, కలెక్టర్ నాగలక్ష్మి గారితో కలిసి మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.

స్విమ్మింగ్ ఫూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

గుంటూరు శ్యామల నగర్ లోని రవీంద్ర నగర్ లోని ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఇంచార్జి మేయర్ సజిల గురువారం ప్రారంభించారు. గతంలో మరమ్మత్తులకు గురయ్యిన ఈ స్విమ్మింగ్ పూల్ ను సుమారు రూ 25 లక్షలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.

ప్రజల ఆరోగ్యరక్షణకు కాటూరి వైద్యకళాశాల చేస్తున్న కృషి వెలకట్టలేనిది : మాజీమంత్రి ప్రత్తిపాటి

ప్రజల ఆరోగ్యరక్షణ కోసం కాటూరి వైద్య కళాశాల పనిచేస్తోందని, వైద్యసిబ్బంది నేరుగా మొబైల్ ల్యాబ్ ద్వారా తమ ఇళ్లవద్దకు వచ్చి అందిస్తున్న వైద్యసేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మండలం గోపాలవారిపాలెం గ్రామంలో కాటూరి వైద్య కళాశాలవారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి సహాయసహాకారంతో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపుని మాజీమంత్రి ప్రత్తిపాటి శుక్రవారం ప్రారంభించారు.

నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ

నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు స్థానిక 25 వ వార్డు పెద్దచెరువు లో పర్యటించారు సైడ్ కాలువలలో పూడికను తీశారు సైడ్ కాలువల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డిని తొలగించారు స్థానికులతో వార్డు లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్టంలో మరియు నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమలను వివరించారు సమస్యల పరిష్కారనికి అధికారులతో చర్చించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా”చదలవాడ మాట్లాడుతూ నరసరావుపేట […]

మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్ రూంలో జీలుగుమిల్లి (M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్ కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు

కొడాలి నాని కి బైపాస్ సర్జరీ ముంబై కి షిఫ్ట్!

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు నాని. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు.. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు డాక్టర్లు. అయితే సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ […]

అమరావతి, మార్చి 30 : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.

పాస్పోర్ట్ సేవలకు పెరిగిన డిమాండ్ దృష్టిలో ఉంచుకొని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏప్రిల్ 5న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రోజుకు విజయవాడ సేవా కేంద్రంలో 800, తిరుపతి సేవా కేంద్రంలో 500 స్లాట్లను శనివారం విడుదల చేశారు. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులు తమ అపాయింట్ మెంట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే కాకుండా ఏప్రిల్లో ప్రతి బుధవారం విజయవాడ సేవా కేంద్రంలో […]

ఉగాది రోజు పేదలకు సాయంపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం

అమరావతి, మార్చి 30 : పేదలకు సాయం అందించేందుకు ఉగాది రోజున సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.38 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను ప్రభుత్వం అందించింది.

ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది