ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ నేటి ఉదయం 9.00 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ప్రారంభమైంది…. #ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొత్తం 163 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు ఉన్నారు

ఈనెల 26వ కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నా

ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలని ర్యాలీలని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కార్మికులతో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మరియు ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వెంకట్ తదితరులు

ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్.టి.ఆర్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు , సచివాలయ మహిళా పోలీస్ వారికి డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణా కార్యక్రమం ను కమాండ్ కంట్రోల్ నందు ప్రారంభించడం జరిగింది. మహిళ కానిస్టేబుల్స్ 38 మందికి , సచివాలయ మహిళా పోలీస్ 38 మందికి […]

సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం

సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం… ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం… ఎన్ని రోజులైనా ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఫైనాన్స్ యాజమాన్యం… కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయట్లేదు అని చెప్పి తిప్పుకుంటున్న పరిస్థితి… గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరుమీద గోల్డ్ రిజిస్టర్ లో లేదని,వడ్డీ ఎక్కువ కట్టాలని […]

కార్యకర్తలను పరామర్శించిన దేవినేని అవినాష్

నందిగామ సబ్ జైల్ లో పెండ్యాల గ్రామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్నా. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు. దేవినేని అవినాష్ గారు మాట్లాడుతూ పెండ్యాల గ్రామం లో జరిగిన చిన్న ఘర్షణలను అడ్డుకున్నందుకు తెదేపా నాయకులు దాడిచేసి ఘర్షణలలో లేని చదువుకునే పిల్లల […]

సైబర్ నేరాలపై మరియు దొంగతనాలు పై ప్రజలకు అవగాహన

చైతన్య ఏసీ క్యాంపస్ మరియు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు సైబర్ నేరాలపై మరియు దొంగతనాలు మాదకద్రవ్యాల పై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ వైవి ఎల్ నాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా సిఐ వై వి ఎల్ నాయుడు మాట్లాడుతూ సైబర్ కేటుగళ్ళ బారిన పడిన ప్రజలు ఎవరైనా వెంటనే పోలీసులను ఆశ్రయించండి ఇలాంటి కేసులలో 80% మంది పరువు పోతుందని పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడం లేదు ఇలా కంప్లీట్ చేయకపోవడం […]

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వస్తుండటం చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు పవన్ కళ్యాణ్ కంటపడి నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్న బొత్స బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి […]

ప్రాధాన్యత రంగాలను పటిష్టం చేయాలని: కడప కలెక్టర్.

ప్రాధాన్యతా రంగాల పటిష్టతతోనే… జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని.. ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన […]

నందిగామ డివిజనల్ పశుసంవర్ధక శాఖ అధికారుల తో సమీక్షా

నందిగామ డివిజనల్ పశుసంవర్ధక శాఖ అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన యన్టీఆర్ జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జె.డి., డాక్టర్.యం.,హనుమంతురావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజనల్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకుల కార్యాలయం లో డిడి. డాక్టర్. మోసెస్ వెస్లి వారి ఆధ్వర్యంలో నందిగామ డివిజనల్ పరిధిలోని పశు సంవర్ధక శాఖ అధికారుల తో యన్టీఆర్ జిల్ల జె.డి., డాక్టర్. హనుమంతురావు సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా యన్టీఆర్ జిల్లా […]

మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందిస్తాం

మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందించి, మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి కోసం తాము అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేశామన్న – మత్స్య శాఖ మంత్రి కే. అచ్చెన్నాయుడు మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ ల మంత్రి కే. అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా తుమ్మలపల్లి కళా […]