ఫిబ్రవరి నాటికి 46 వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు
జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మంజూరైన 94,512 కుళాయి కనెక్షన్లు గానూ ఫిబ్రవరి 2025 నాటికి 46,316 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) సమావేశాన్ని కలెక్టర్ పి.అరుణ్ బాబు నిర్వహించారు. రానున్న ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు రూ.3.87 కోట్ల ప్రణాళికను ఆమోదించారు. ఈ మొత్తాన్ని బోరు […]