పాపం : కడుపులో కత్తెర మర్చిపోయారు

హైదరాబాద్:మార్చి 29 లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో శస్త్రచికిత్స కత్తెర బయటపడింది, సంధ్య పాండే అనే మహిళ ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ నర్సింగ్ హోమ్‌లో సి-సెక్షన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసు ఫిర్యాదు ప్రకారం.. శస్త్రచికిత్స జరిగినప్పటి నుండి ఆమెకు నిరంతర […]

మణిపూర్ భూకంపం

మణిపూర్ మరోసారి భూకంపం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరణ గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు కార్యదర్శి మస్తానయ్య తెలిపారు

అమరావతిలో సొంతిల్లు నిర్మించుకోనున్న చంద్రబాబు

అమరావతిలో సొంతిల్లు నిర్మించుకోనున్న చంద్రబాబు వెలగపూడిలోని ఈ6 రోడ్‌లో 5 ఎకరాల స్థలం కొనుగోలు ఏప్రిల్‌ 9న ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన త్వరలో ప్రారంభం కానున్న అమరావతి పునర్నిర్మాణ పనులు ఈలోపే సొంతింటికి భూమిపూజ చేయాలని చంద్రబాబు నిర్ణయం

ఏపీలో ‘EPC మోడల్’లో మెట్రో రైల్ ప్రాజెక్టుల పనులు

ఏపీలో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) మోడల్లో చేపట్టాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రాజెక్టు డిజైన్ల తయారీకి ఇంటరిమ్ కన్సల్టెంట్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, గుజరాత్, చెన్నై మెట్రో ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్న విశ్రాంత అధికారుల సేవలు వినియోగించుకోవాలని తీర్మానించింది.

ఈ ఏడాదికి తొలి సూర్య గ్రహణం

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్య గ్రహణం పూర్తవుతుంది.

కదల లేకున్నా.. స్ట్రెచర్‌పై వచ్చి పరీక్ష రాసిన విద్యార్థిని

విధి వెంటాడినా.. ఓ విద్యార్థిని మాత్రం పట్టు వదలకుండా పదోతరగతి పరీక్షలు రాస్తోంది. సత్యసాయి జిల్లాకు చెందిన తనూజ అనే విద్యార్థిని లేపాక్షి కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల విద్యార్థిని విద్యాలయంలో మెట్లపై జారి కిందపడింది. ఎడమ చేతికి, వెనక వైపు ఎముకలకు దెబ్బలు తగలగా.. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను హిందూపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. పరీక్షలు రాస్తానని విద్యార్థిని పట్టుబట్టడంతో అంబులెన్స్‌లోనే […]

మ‌య‌న్మార్, థాయ్ ల్యాండ్ దేశాల‌లో నేడు భారీ భూక‌పం సంబ‌వించింది.

రిక్ట‌ర్ స్కేల్ మీద ఈ తీవ్ర‌త 7.7 గా న‌మోదైంది.. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాల‌లో బారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.. దీని తీవ్ర‌త‌కు ప‌లు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి భ‌యంతో ప‌రుగులు తీశారు.. మ‌రికొంద‌రు ప్రాణాలు రక్షించేందుకు ఈల కొల‌నుల‌లో దూకారు.. ఇక బ్యాంకాంక్ లో ఈ భూకంప తీవ్ర‌త 7.3 గా న‌మోదైంది. ఈ న‌గ‌రంలో అనేక భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మైన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.. స‌హాయ కార్య‌క్ర‌మాల […]

నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అడుగుజాడల్లో పారిశుద్ధ్య కార్యక్రమం

ఈ రోజు నరసరావుపేట 10వ వార్డ్ సతీష్ బజారు.11వ వార్డ్ బ్యాంకు రోడ్డు లో. 24 వ వార్డ్ SSN కాలేజ్ వెనుక రోడ్డు లో.31 వ వార్డ్ 2 బజార్ల లో. 23 వ వార్డ్ లో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పూడిక తీయుట. చెత్త తొలగించుట. టిడిపి నాయకులు, కార్యకర్తలు, MLA చదలవాడ అరవింద బాబు గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. స్వచ్ఛ – నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10 వ వార్డ్ సతీష్ […]

ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయంలో ప్రజా దర్బార్

వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవీ ఆంజనేయులు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్‌ గారి కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. […]