పెట్రోల్ ధరలు తగ్గుతాయి: మోదీ

గత పదేళ్లలో 25 కోట్లమందిని పేదరికం నుంచి బయటపడేశామని ప్రధాని మోదీ తెలిపారు. లోక్సభలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. “వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం. మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయి. ఇథనాల్ బ్లెండింగ్తో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గుతాయి” అని పేర్కొన్నారు.

రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ..?

ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ వేడు కలో పాల్గొని గంగా, య మునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమం లో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నా రు. ఈ సందర్బంగా ఈనెల 5వ తేదీన భారత ప్రధాని మోదీ మహాకుంభమేళాను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాక కోసం యూపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి రేపు ఉదయం 10 […]

అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

ఏపీలో రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో అమరావతిలో పనులకు అనుమతి ఇవ్వాలని సీఆర్డీఏ ఈసీకి లేఖ రాయగా అభ్యంతరం లేదని బదులిచ్చింది. టెండర్లు పిలవొచ్చని, అయితే ఎన్నికలు పూర్తయ్యాకే ఖరారు చేయాలని పేర్కొంది.

భగ్గుమంటున్న భానుడు.. ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు..

ప్రస్తుత ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు 3,4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు ఫిబ్రవరి సగం నెల కూడా పూర్తి కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలో వచ్చే శివరాత్రితో చలి శివ శివా అనుకుంటూ వెళ్లిపోతుందని చెబుతారు.. కానీ, చలికాలం పూర్తవకుండానే ఎండలు మండిపోతున్నాయి.

రాజానగరం మండల చక్రద్వారబంధం గ్రామంలో నూతనంగా నిర్మించిన

రాజానగరం మండల చక్రద్వారబంధం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 15 వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని ఆహ్వానించిన చక్రద్వారబంధం NDA కూటమి నాయకులు

బాపట్ల డిపో పరిధిలోని కొత్త రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని వినతి.

రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని కోరిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు అమరావతి, జనవరి 05. బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం

వినుకొండ మండలం వినుకొండ నుండి కుమ్మరిపాలెం, తిమ్మాయిపాలెం, పానకాల పాలెం, శ్రీనగర్, వేస్తున్న తారు రోడ్డు పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణం వలన ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. అంతే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక […]