అంబేడ్కర్ దార్శనికత.. అందరికీ ఆదర్శం కావాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
బాబాసాహెబ్ అంబేడ్కర్ దార్శనికత మనందరికీ ఆదర్శం కావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త బాబాసాహెబ్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా. శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఎన్డీయే కూటమి,యస్సీ సెల్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాల్లర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని,అంబేద్కర్ వర్ధంతిని మహాపరినిర్వాన్ దివస్‌గా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడం లో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన బీఆర్ అంబేద్కర్ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన అంబేద్కర్ అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని,ఒక మహిళ స్వేచ, సమాజ అభివృధి మీద ఆధారపడి ఉంటుందని ఆనాడే అంబేద్కర్ చెప్పారని, అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారన్నారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేమని చెప్పిన అంబేద్కర్ మహాశయుని దార్శనికత మనందరికీ ఆదర్శం కావాలని,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మానుకోండ శివ ప్రసాద్,దర్సనపు యాకోబు,లాం వర్ధన్ రావు,రాజీవ్ ఆనంద్, తెలగతోటి సుదీర్,మార్క్,నవమి,మానం శ్రీనివాస్, కొమ్మినేని కోటేశ్వరరావు,ముతినేని రాజేష్, విజయలక్ష్మి,రబ్బాని,గాలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.