#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

పత్రికా ప్రకటన,
28/4/25:ప్రజా సమస్యల పరిష్కార వేది క’లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి 168 అర్జీలను స్వీకరించారు.