#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమానుల నిర్లక్ష్యం ఫై అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల వలన జరిగే ఇబ్బందులను శాసన సభా సాక్షిగా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ ఖాళిస్థలాల విషయాన్నీ ప్రస్తావించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సుమారు 10 నుండి 15 ఖాళీ స్థలాలు ఉంటాయని, ప్రధానంగా 21, 25, 28, 29, 36, 39, 43 డివిజన్ లలో అధికంగా ఉంటున్నాయని, వీటి స్థల యజమానుల నిర్లక్ష్యం వలన స్థలాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి, చెత్త, విష సర్పాలు మరియు మురుగు నీరు నిలబడి ఉంటున్నాయని పేర్కొంటూ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యల చిత్రాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి చూపించారు

జనంలోకి మనం.