#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఉత్తమ సేవలను అందించడంలో ఎస్. బి .ఐ. ముందంజ

ఖాతాదారులకు ఉత్తమమైన సేవలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందంజలో ఉంటుందని రీజనల్ మేనేజర్ వి నవీన్ బాబు పేర్కొన్నారు. యన్టీఆర్ జిల్ల నందిగామ లో మంగళవారం స్థానిక క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాల్ నందు నందిగామ మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ఎం వి నవీన్ బాబు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు ద్వారా తమ ఖాతాదారులకు ముద్ర లోన్లు.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 10 లక్షల నుండి రెండు కోట్ల వరకు స్వయం సిద్దా లోన్లు,బిజినెస్ లోన్స్ పెన్షనర్స్ పెన్షన్ హౌసింగ్ లోన్లు కారులోన్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సమావేశంలో ఏర్పాటు బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ, అదేవిధంగా జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలను ఎలా ఎదుర్కోవాలో వివరంగా సమావేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ నందు వీడియోలు ద్వారా వివరించారు.