ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది