గుంటూరు జిల్లా పోలీస్…
అంతరాష్ట్రాల నుండి సెల్ ఫోన్ల రికవరీ – బాధితులకు అందజేత – బాధితుల ముఖాల్లో వెళ్లివిరిసిన ఆనందం.
📱గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి., ఆదేశాల మేరకు సుమారు 33 లక్షల విలువైన 220 దొంగిలింపబడిన మరియు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసిన గుంటూరు పోలీసులు.📱
ఈరోజు(12.12.2024) జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో బాధితులకు అందజేసిన జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీమతి K. సుప్రజ గారు,.
📱 మొబైల్ ఫోన్లు మన దైనందిన జీవితంలో అంతర్భాగమైపోయాయి. సమాజంలోని ఇతర వ్యక్తులతో సులభంగా, సౌకర్యవంతంగా సంభాషించుకోవడానికి, వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి, ఏదైనా ప్రదేశం గురించి, వ్యక్తి గురించి తెలుసుకోవడానికి సెల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కావున చిన్నా – పెద్ద, ఆడ – మగ, చదువుకున్న వారు – చదువుకోని వారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి వద్ద ఈ సెల్ ఫోన్లు శరీరంలోని ఒక భాగంలా మిళితమైపోయినాయి