గుంటూరు నగరంలో యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో
గుంటూరు నగరంలో యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో వచ్చిన కొందరు యువకులు, స్థానిక ఇస్కాన్ మరియు అక్షయపాత్ర వారికి అలానే పోలీసు ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా రోడ్లు పై ట్రాఫిక్ కి అసౌకర్యం కలిగిస్తూ భగవద్గీత పుస్తకాలను విక్రయిస్తున్న వారితో మాట్లాడి అలా రోడ్లపై కాకుండా మున్సిపల్ అధికారుల వద్ద అనుమతి తీసుకొని స్టాల్స్ ఏర్పాటు చేసుకొని అమ్ముకోవాల్సిందిగా సూచించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకునే వారు పొంచి ఉన్నప్పటికి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారి పనితీరు అభినందనీయమని స్థానిక ప్రజలు చర్చించుకున్నారు.