జిల్లాలో 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఎఎస్.

జిల్లాలో 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఎఎస్.
జిల్లాలో మార్చి 01 నుంచి 20వ తేదీ వరకూ 48 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ రాత పరీక్షలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. 17,905 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 14,529 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం 32,434 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు.
వీరితో పాటూ మరో 2117 మంది విద్యార్థులు మార్చి 03 నుంచి 15 వరకూ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు. 9 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.