#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

దేదీప్యమానంగా సహస్ర దీపోత్సవం

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చల్లగరిగ గ్రామం దళిత వాడలో ttd వారు మరియు గ్రామ పెద్దల చే నిర్మితమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో కార్తీకదామోదర సహస్ర దీపోత్సవం గ్రామ పెద్దల సహకారంతో దేవాలయ అర్చకులు శ్రీ వేదాంతం. పవన్ కుమార్ ఆచార్యులు, రెంటాల. సత్యనారాయణ గార్ల సేవలో అద్భుతం గా జరిగింది.
కార్యక్రమం లో “ప్రవచనకేసరి -వాస్తు, జ్యోతిష్య బ్రహ్మ “-బ్రాహ్మశ్రీ నందిపాటి. రవీంద్రకుమార్ ఆచార్య ప్రవచనం వీనులవిందుగా సాగింది. కార్యక్రమానికి దేవరశెట్టి. శ్రీనివాసరావు వ్యాఖ్యానం తో కిక్కరిసిన భక్తజనుల మధ్య శోభాయమనంగా సాగింది