#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

నరసరావుపేటలో భారతరత్న డా”బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డా”చదలవాడ

నరసరావుపేట నియోజకవర్గంలో డా”బి ఆర్ అంబేద్కర్ విగ్రహని పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డా”బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నరసరావుపేట శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే డా”అరవింద బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డా”బి ఆర్ అంబేద్కర్ ఆయన యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరు వారి అడుగు జాడల్లో నడిచి సమాజానికి మేలు జరిగే విధంగా పని చేయాలనీ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ కి నివాళులు అర్పించారు.