పిడుగురాళ్ల ఏపీయూడబ్ల్యూజే కమిటీ సమావేశం

పిడుగురాళ్ల ఏపీయూడబ్ల్యూజే కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం బంగ్లాలో జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులు సమిష్టిగా కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రెండు గ్రూపులుగా ఉన్న ఏపీయూడబ్ల్యూజే ఈరోజు నుంచి ఒకే కమిటీగా ఏర్పాటై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు గుదె నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ నూతన అధ్యక్షులుగా గుత్తా పేరయ్య (ఆంధ్రజ్యోతి ), కార్యదర్శి షేక్ రంజాన్ వలి, కోశాధికారి సూరపు మణికంఠ(చిన్నా), ఉపాధ్యక్షులు దామిశెట్టి నవీన్ కుమార్, చిందుకూరి నాగేంద్రరావు, సహాయ కార్యదర్శి యరగాని ఏసుబాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వళ్లెం మల్లిఖార్జునరెడ్డి, గౌరవాద్యక్షులు రామిశెట్టి మధుసూదనరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి రమేశ్ బాబు, ఐ జే యు మాజీ సభ్యులు మల్లెంశెట్టి లక్ష్మణరావు, సీనియర్ జర్నలిస్టులు కొమ్మా మహేష్, జి నెమిలిరెడ్డి, డి రామారావు, షేక్ బాషా, సయ్యద్ ఆరిఫ్ ఎం రవీంద్ర, సి హెచ్ రాజేంద్ర ప్రసాద్, కరిముల్ల , పఠాన్ సైదా, సైదా చారి, తదితరులు పాల్గొన్నారు