భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలని గోళ్లపాడు రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు నుంచి ప్రారంభించిన రెవెన్యూ సదస్సులో భాగంగా కుటుంబ వివాదాల కారణంగా భూ సమస్యలు అ పరిష్కృతంగా నిలిచిపోతున్నాయని, వాటిని సరిచేసుకుంటే అర్జీల పరిష్కారం సులభతరం అవుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శుక్రవారం ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు గ్రామంలో రెవిన్యూ గ్రామ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ భవాని శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణ్ బాబు మాట్లాడుతూ కోర్టు కేసులు, ఇతర వివాదాల్లేని ప్రతి అర్జీని, సమస్యను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఏళ్ల తరబడి చిన్న చిన్న కారణాలతో రైతులు, పేద వర్గాల వారు భూ వివాద సమస్యలతో చితికి పోతున్నారన్నారు. ఇలాంటి వాటికి రెవెన్యూ గ్రామ సదస్సులు పరిష్కార వేదికలు కావాలాన్నారు.. ఈ గ్రామ సభలో వచ్చిన ప్రతి అర్జీకి రసీదు ఇచ్చి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి జె విలియమ్స్, డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మీప్రసాద్, ఈవో పి ఆర్ డి రూపవతి, రెవిన్యూ సిబ్బంది, గోళ్ళపాడు, కుందూరువారి పాలెం గ్రామ రైతులు పాల్గొన్నారు.