#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందిస్తాం

మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందించి, మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి కోసం
తాము అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేశామన్న
– మత్స్య శాఖ మంత్రి కే. అచ్చెన్నాయుడు

మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ ల మంత్రి కే. అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి, భద్రత కోసం మత్స్య రంగంలో ఎదురవుతునన క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రతి ఏటా నవంబర్ 21 న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు.