మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు
ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ.
మహిళలు , పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ కావలి గ్రీష్మ పేర్కొన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహిళా ప్రాంగణంలో ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా కావలి గ్రీష్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తన కుమార్తె కావలి గ్రీష్మపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఛైర్ పర్సన్ కావలి గ్రీష్మ మీడియా వారితో మాట్లాడుతూ నాకు ఈ పదవినిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ పదవిలో వున్నంత కాలం ఎటువంటి స్వార్ధం లేకుండా మహిళల అభ్యున్నతి కోసం పని చేస్తానన్నారు. ఒక మహిళగా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతో ఆవేదన అనుభవించానని , మహిళలపై దాడులు జరుగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి గారు ఒక మహిళను హోమ్ మంత్రిగా చేశారన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు