మహిళల భద్రత అంశంలో సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలన్న
మనదేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మధరావు అన్నారు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం మరియు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద శుక్రవారం మహిళల సమానత్వం 1కె వాక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాజ్యాంగంలో పొందుపరచిన కఠినమైన చట్టాలను సరైన రీతిలో మహిళలు వినియోగించుకున