మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్ రూంలో జీలుగుమిల్లి (M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్ కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు