రఘవాపురం, రంగాపురం గ్రామాల్లో పించన్ పంపిణీలో పాల్గొన్న – ముప్పిడి నాగేశ్వరరెడ్డి–

ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ కూటమి అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు రఘవాపురం, రంగాపురం గ్రామాల్లో పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు స్వయంగా పింఛన్ అందజేసి, ప్రభుత్వ సంక్షేమ విధానాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ పథకం వల్ల అనేక వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ప్రభుత్వ సహాయంతో మరింత ఆత్మస్థైర్యంగా జీవించగలుగుతున్నారు” అని అన్నారు.
ప్రజలు పొందే ప్రయోజనాల గురించి వివరించిన ఆయన, “ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడంలో మనందరి బాధ్యత ఉంది. ప్రజలకు అండగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.