#తాజా వార్తలు #తెలంగాణ

వరంగల్ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో మాటలతో బీఆర్ఎస్ గడిపిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.

వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ (Prajapalana Vijayotsava Sabha ) ఇవాళ(మంగళవారం) వరంగల్ (Warangal) నగరంలో జరగనుంది. విజయోత్సవ సభ కోసం వరంగల్ ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఇందిరాగాంధీ జయంతి (Indira Gandhi Jayanti) రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాగా ప్లెక్సీలు, కటౌట్లతో ఓరుగల్లు మూడు రంగులమయమైంది.