#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు #రాజకీయం

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. ఏమైదంటే..

కృష్ణా: వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ( Vallabhaneni Vamsi) బిగ్ షాక్ తగిలింది. వంశీ ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్య అనుచరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు), గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రదేశాల్లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.