విజయసాయిరెడ్డికి మతి భ్రమించిందన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ లుక్ అవుట్ నోటిసులు ఇచ్చిన కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు ఫై అనుచిత వ్యాఖ్యలు చేయటం విజయ సాయి రెడ్డికే చెల్లిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంలో కుట్రకోణం దాగి ఉందేమోనన్న దానిపై పోలిస్ ఉన్నత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. లుక్ అవుట్ నోటిసులు ఇచ్చిన కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు ఫై అనుచిత వ్యాఖ్యలు చేయటం విజయ సాయి రెడ్డికే చెల్లిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడ పోర్టును జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి బెదిరించి రాయించేసుకున్న వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. చంద్రబాబుపై ఇష్టమోచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు బతికి ఉంటే.. ఆయన్ను జైల్లో వేస్తాం అంటూ మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి చంచల్ గూడ ఏ-2 ఖైదీనన్న విషయం మరిచిపోతే ఎలా అని గళ్ళా మాధవి ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి హత్య చేయబడితే మొదటగా దానిని గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిని కూడా ముద్దాయిగా చేర్చాలన్నారు. ఇప్పటికే కొడాలి నాని,అంబటి, రోజా లాంటి వారి వలన తమ పార్టీ కూలిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యిందన్నారు.