#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన

విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన శ్రీ చైతన్య స్కూల్ పైన మరియు ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి – (ఎస్ఎఫ్ఐ)

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాని కలిసి శ్రీ చైతన్య ప్రిన్సిపల్, మరియు పాఠశాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు పిర్యాదు చేసారు

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సి.హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జి.గోపి నాయక్ మాట్లాడుతూ పెనుగంచప్రోలు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు తొమ్మిదవ తరగతి చదువుతున్నా విద్యార్థులపై చక్క కర్రతో విపరీతంగా కొట్టడంతో జి.ఉమారాణి అనే విద్యార్థిని నరాలపై బలంగా తగలడంతో కుప్పకూలి పడిపోగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కీ తీసుకెళ్ళి వైద్య అందించారని మరియు జరిగిన ఘటనపై తల్లిదండ్రులు ప్రశ్నించిన సందర్భంలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. గతంలో కుడా ఇలాంటి ఘటనలు పాఠశాలలో అనేకం జరిగాయనీ విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారని అన్నారు. పాఠశాలలో ఇంత జరిగిన ఎం.ఈ.ఓ, డివైఈఓ ఇప్పటివరకు స్పందించలేదనీ అన్నారు. డి.ఈ.ఓ మరియు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.