#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

శ్రీశైలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

కుటుంబసమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న హోంమంత్రి
ఎక్స్ అకౌంట్ ద్వారా రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడి
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఆమె సమీక్ష చేశారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అంతకుముందు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దర్శనాంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో హోంమంత్రి అనితకు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలంతా శాంతిభద్రతలతో సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీశైలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

27-11-2024 | ePaper | Bharatha Vanitha TV