సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం
సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం నందు క్రోసూరు కి చెందిన గౌరవనీయులు బత్తుల మల్లేష్ తల్లి కీర్తిశేషులు బత్తుల లక్ష్మి 7 వ వర్ధంతి సందర్భంగా సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా బత్తుల మల్లేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులను గుర్తుచేసుకొని అనాధ ఆశ్రమాలలో భోజనం ఏర్పాటు చేయటం వృద్ధులకు నిర్భాగ్యులకు అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉందని తల్లి పాత్ర సమాజంలో ఎంతో ఉందని జన్మనిచ్చిన తల్లిని గౌరవించినప్పుడే వారు చెప్పే మాటలు వారు చూపే దారిలో నడిచినప్పుడే మన జీవితాలు సార్ధకం అవుతాయని అన్నారు. హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు మాట్లాడుతూ మనిషిగా పుట్టినందుకు సమాజo పట్ల బాధ్యతగా ఉండాలని ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈ సమయంలో అనాధలకు వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం , బత్తుల లక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని అని అన్నారు .ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యు లు కీర్తిశేషులు బత్తుల లక్ష్మి కోడలు కవిత మనవరాలు మోక్ష శ్రీ నేత్ర శ్రీ హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు , రమేష్ ,వృద్ధాశ్రమ నిర్వాహకులు ఏడుకొండలు శ్రీనివాస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు