#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

సైబర్ నేరాలపై మరియు దొంగతనాలు పై ప్రజలకు అవగాహన

చైతన్య ఏసీ క్యాంపస్ మరియు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు సైబర్ నేరాలపై మరియు దొంగతనాలు మాదకద్రవ్యాల పై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ వైవి ఎల్ నాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్
ఈ సందర్భంగా సిఐ వై వి ఎల్ నాయుడు మాట్లాడుతూ సైబర్ కేటుగళ్ళ బారిన పడిన ప్రజలు ఎవరైనా వెంటనే పోలీసులను ఆశ్రయించండి ఇలాంటి కేసులలో 80% మంది పరువు పోతుందని పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడం లేదు ఇలా కంప్లీట్ చేయకపోవడం వల్ల సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు
సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోయిన వారు సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు మొదటి గంట గోల్డెన్ అవర్ అంటారు ఎవరైనా యాక్సిడెంట్ లో గాయాలు అయినప్పుడు మొదటి గంట హాస్పటల్ కు చేర్చడం ఎంత ముఖ్యమో అదేవిధంగా సైబర్ నేరాల బారిన పడిన వారు మొదటి గంటలోనే గోల్డెన్ అవర్ లోనే కంప్లైంట్ చేస్తే నేరగాలను వెంటనే పట్టుకోవచ్చు ఒక గంట దాటితే రికవరీ పర్సంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటివి విద్యార్థులు చదువుకున్నవారు అవగాహన చేసుకోవాలని మీరు అవగాహన చేసుకుని తల్లిదండ్రులకు చుట్టుపక్కల వారికి కూడా తెలపాలని సిఐ తెలిపారు